
మద్యం మత్తులో యువకుడి వీరంగం
మధురానగర్(విజయవాడసెంట్రల్): మద్యం మత్తులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువకుడు మధురానగర్‌లో వీరంగం సృష్టించాడు. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజేష్ శ్యామ్(22) బెంగళూరు నుంచి తన సొంత నివాస ప్రాంతానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో విజయవాడలో ట్రైన్ దిగిన రాజేష్ పూటుగా మద్యం తాగాడు. మద్యం మత్తులో స్పృహ తెలియక దారితప్పి బీఆర్టీఎస్ రోడ్డు మధురానగర్ చిన్న వంతెన వద్దకు చేరుకున్నాడు. మద్యం మత్తులో తూలుతూ వంతెన వద్ద ప్రమాదకరంగా నడుస్తుండటంతో స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వీలు పడలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి మద్యం మత్తులో ఉన్న రాజేష్ చెప్పిన మాట వినకుండా తూలుతూ రైవస్ కాలువలో పడిపోయాడు. దీంతో పోలీసులు హుటాహుటిన తాడు వేసి రైవస్ కాలువలోకి దూకి రాజేష్‌ను బయటకు తీసుకువచ్చారు. అనంతరం ప్రథమ చికిత్స చేసి 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు

మద్యం మత్తులో యువకుడి వీరంగం