
సౌత్‌జోన్ ఖోఖో పోటీలకు జట్లు ఎంపిక
గన్నవరం: స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో శనివారం ఖోఖో సౌత్ జోన్ పోటీల్లో పాల్గొనే పురుషులు, మహిళల రాష్ట్ర జట్ల ఎంపికలు నిర్వహించారు. ఆంధ్ర ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెలక్షన్స్‌కు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 120మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబరిచిన పురుషులు, మహిళల జట్లకు 15మంది చొప్పున క్రీడాకారులను, స్టాండ్ బైగా మరో తొమ్మిది మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు శిక్షణ అనంతరం కర్ణాటక రాష్ట్రం దావణగిరిలో ఈ 24 నుండి 26వతేదీ వరకు జరిగే సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటారని ఆంధ్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు టిఎస్‌ఆర్‌కె. ప్రసాద్ తెలిపారు. ఈ పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించి పతకాలతో తిరిగిరావాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉత్తమ క్రీడాకారులను జాతికి అందించే దిశగా తమ అసోసియేషన్ కృషి చేస్తుందని చైర్మన్ గరటయ్య తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం.సీతారామిరెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మడక ప్రసాద్, సత్యప్రసాద్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కేవీఆర్. కిషోర్, సెలక్షన్ కమిటీ సభ్యులు ఖాసీ, రవిబాబు, గిరిప్రసాద్, పట్టాభి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర జట్ల వివరాలు..
పురుషుల జట్టు: ఆర్.సునీల్‌నాయుడు, కుంభా నరేష్, ఎన్‌ఎస్.రాజు, వై.సుధీర్‌కుమార్, ఎస్‌కె.మహమ్మద్, ఐ.ఎలియా(ప్రకాశం), ఎస్‌కె.మహబుబ్(కర్నూల్), కోడూరి కొండలరావు(కృష్ణా), బి. కిరణ్(వైజాగ్), జి.సంతోష్(అనంతపురం), వి.భానుప్రకాష్(విజయనగరం), కె.శివశంకర్(తూర్పుగోదావరి), కె.ప్రవీణ్(శ్రీకాకుళం), పి.వరుణ్(చిత్తూరు), వై.అశిష్(నెల్లూరు).
మహిళల జట్టు: పి. చంద్రఅనూష, జి.పావని (పశ్చిమ గోదావరి), పి.హేమ, బి.శిరీష(విశాఖపట్నం), ఎస్.పావని, వి. శశికళ, ఆర్.యశోద, ఎం.సఖీయా, వి.నాగమల్లేశ్వరి(ప్రకాశం), కె. కుమారి, కె.ఉర్ధవ(కృష్ణా), బీ. గుణవతి, పి.అమృత(శ్రీకాకుళం), జె.శ్రావణి(విజయనగరం), కె.కీర్తన(చిత్తూరు).