
ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్య పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పాఠశాల విద్యాశాఖలో 92 శాతానికి పైగా ఉన్న పంచాయతీరాజ్ ఉద్యోగులదే కీలక భూమిక అని డెమోక్రటిక్ పీఆ ర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డి. శ్రీను అన్నారు. గత 40 ఏళ్లుగా ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు సంబంఽధించిన ఉమ్మడి సర్వీస్ రూల్స్ అపరిష్కతంగా ఉన్నాయని, వాటి పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి తగు న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌కు విజ్ఞప్తి చేశారు. విజయవాడ హోటల్ ఐలాపురంలో శనివారం రాష్ట్ర బీజేపీ టీచర్స్ సెల్ కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను ఉపాధ్యాయుల సమస్యలను మాధవ్‌కు వివరించారు. అనంతరం మాధవ్‌ను శాలువాతో సత్కరించి భారతమాత జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలను కూటమి ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లి వారికి తగిన న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో. విద్యారంగంలో విశిష్టమైన కృషి చేసిన 24 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.
డెమోక్రటిక్ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను