రైతుకు అండగా పోరుకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

రైతుకు అండగా పోరుకు సిద్ధం

Sep 7 2025 8:33 AM | Updated on Sep 7 2025 8:33 AM

రైతుకు అండగా పోరుకు సిద్ధం

రైతుకు అండగా పోరుకు సిద్ధం

రైతుకు అండగా పోరుకు సిద్ధం

వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో9న అన్నదాత పోరు రైతుల ఇబ్బందులను తొలగించాలని వినతి

చిలకలపూడి(మచిలీపట్నం): ఎరువుల కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారికి అండగా పోరాటానికి సిద్ధమయ్యా మని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జులు తెలిపారు. మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ నియోజకవర్గాల ఇన్‌చార్జులు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), ఉప్పాల రాము, సింహాద్రి రమేష్‌బాబు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ.. రైతుల కష్టాలను తాము తెలియజేస్తుంటే కూటమి పాలకులు తమపై ఫేక్‌ ప్రచారమంటూ కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు ఎక్కడా ఎరువుల కోసం ఇబ్బందులు ఎదుర్కోలేదని గుర్తుచేశారు. గతంలో బీపీటీ ధాన్యం బస్తా రూ.2,200 చొప్పున రైతులు విక్రయించారని, ఇప్పుడు రూ.1,500 నుంచి రూ.1,600ల లోపే ధర వస్తోందని వివరించారు. ఒక పక్క ధాన్యం ధర పడిపోయి కుదేలైన రైతులు యూరియా అందించకుంటే ఖరీఫ్‌లో వరి దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా బూటకపు మాటలు చెబుతోందని దుయ్యబట్టారు. రైతులు, వలంటీర్లు, ఉద్యోగులను మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై ఎరువుల కష్టాలను తీర్చేందుకు తమ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని మాయమాటలు చెబుతోందని విమర్శించారు. పీఏసీఎస్‌లను సందర్శించి ఖాళీ గోదాములను చూపించినా పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వం అరకొరగా ఎరువులు అందించటంతో, పీఏసీఎస్‌లలో కూటమి నాయకులు చెప్పిన వారికే యూరియా ఇస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు యూరియా వేస్తే క్యాన్సర్‌ వస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉప్పాల రమేష్‌ (రాము) మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రైతులు ఎటువంటి కష్టాలు పడకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారని గుర్తుచేశారు. గతంలో ఎప్పుడూ ఇప్పటిలా రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడటం చూడలేదన్నారు. ఈ నెల తొమ్మిదో తేదీన బందరు లక్ష్మీ టాకీసు నుంచి ధర్నాచౌక్‌ వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతిపత్రం వస్తామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల రైతులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. అనంతరం అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement