
గంజాయి ముఠా అరెస్టు
ఉయ్యూరు: గంజాయి ముఠాను ఉయ్యూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీఐ టీవీవీ రామారావు తెలిపిన కథనం మేరకు...ఉయ్యూరు పట్టణంలో గంజాయి విక్రయాల సమాచారం అందుకున్న పోలీసులు సీఐ రామారావు ఆధ్వర్యంలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో తొమ్మిది మంది గంజాయి విక్రయదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 2.50 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న పొదిలపు జగదీష్‌కుమార్, కొలసాని వెంకట సాయి, సానక నరేంద్ర, గుడిమెట్ల ప్రవీణ్‌కుమార్, మిక్కిలి సంజయ్‌కుమార్, దున్నాల మనోజ్, మహ్మద్ అహ్మద్ బాషా, ఓరుగంటి గోపయ్యస్వామి, సయ్యద్ మునీర్‌లను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు.