11న వక్ఫ్ భూములకు కౌలు వేలం
పెనమలూరు: మండల పరిధిలోని వక్ఫ్ భూములకు ఈ నెల 11వ తేదీన కౌలు వేలం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. వక్ఫ్ భూములపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించారు. వివరాల్లోకి వెళ్తే.. తాడిగడప, పెదపులిపాక గ్రామాల్లో కొండపల్లి ఖాజీ సర్వీసుకు చెందిన వక్ఫ్ భూములు వివిధ సర్వే నంబర్లలో 43.23 ఎకరాల సాగు భూమి ఉంది. చాలా కాలంగా ఈ భూములకు కౌలు వేలం నిర్వహించలేదు. కొందరి కబంధ హస్తాల్లో ఈ భూములు చిక్కుకుపోయాయి. అదేవిధంగా కౌలు సొమ్ము కూడా వక్ఫ్ బోర్డుకు చెల్లించలేదు. హైకోర్టు ఆదేశించినా కౌలు వేలం నిర్వహించడానికి అధికారులు జాప్యం చేశారు. చివరకు ఈనెల 11న తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11గంటలకు వక్ఫ్ భూముల కౌలు వేలం నిర్వహిస్తామని తహసీల్దార్ ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు సమాచారం ఇచ్చారు.


