
కృష్ణా నదిని డంపింగ్ యార్డులా చేస్తున్నారు
కొందరు వ్యక్తులు బిల్డింగ్ మెటీరియల్, ఇతర వ్యర్థాలను వాహనాల్లో తరలించి నదిలో కలుపుతున్నారు. వారధి వద్ద, రామలింగేశ్వరనగర్ ప్రాంతాల్లో విపరీతంగా వ్యర్థాలను నదిలో వదులుతున్నారు. కృష్ణానదిని డంపింగ్ యార్డుగా తయారుచేస్తున్నారు. పలుమార్లు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ వ్యక్తుల వాహనాలు నదిలోకి వెళ్లకుండా అబ్జర్వర్‌ను గానీ, గేటు గానీ ఏర్పాటు చేయాలి. నదులను కలుషితం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
–పుప్పాల కృష్ణ, సీపీఎం తూర్పు నగర కార్యదర్శి