కృష్ణా తీరాన రామలింగేశ్వరునికి విశేష అభిషేకాలు | - | Sakshi
Sakshi News home page

కృష్ణా తీరాన రామలింగేశ్వరునికి విశేష అభిషేకాలు

May 26 2025 1:29 AM | Updated on May 26 2025 1:29 AM

కృష్ణ

కృష్ణా తీరాన రామలింగేశ్వరునికి విశేష అభిషేకాలు

నాగాయలంక: మాస శివరాత్రిని పురస్కరించుకుని స్థానిక శ్రీరామ పాదక్షేత్రం వద్ద కృష్ణానదిలోని శ్రీగంగ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి మండపంలో శివలింగానికి ఆదివారం విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. క్షేత్రం చైర్మన్‌ ఆలూరి శ్రీనివాసరావు పర్యవేక్షణలో మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన సామాన్య భక్తులతో కలసి వేకువ జామున విభూధి, నారికేళ, గోక్షీరం, తేనె, పంచదార, పసుపు, కుంకుమ తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అభిషేకాల తదుపరి స్వామివారిని పూలు, పండ్లతో సుందరంగా అలంకరించారు. మాస శివరాత్రి పర్వతిథిని పురస్కరించుకుని నాగాయలంకలోని పురాతనమైన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం ఆలయ అర్చకుడు సాయి కిరణ్‌ శర్మ బ్రహ్మత్వంలో విశేష పూజ నిర్వహించారు. స్వామికి జరిపిన ప్రత్యేక అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

8వ తేదీన బాడీ బిల్డింగ్‌ జట్టు ఎంపిక

పెనమలూరు: వచ్చే నెలలో జరగనున్న రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలకు ఉమ్మడి కృష్ణా జిల్లాల క్రీడాకారుల ఎంపిక చేస్తామని బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బి.మనోహర్‌, తాళ్లూరి అశోక్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం కానూరులో వివరాలు తెలుపుతూ జూన్‌ 22వ తేదీన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి పాల్గొనే క్రీడాకారులకు జూన్‌ 8వ తేదీ ఆదివారం జట్టు ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సింగ్‌నగర్‌ మనోహర్‌ జిమ్‌లో క్రీడాకారుల ఎంపిక ఉదయం 9 గంటలకు జరుగుతుందని, ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఎంపికలో పాల్గొనాలని సూచించారు. మరిన్ని వివరాలకు 86867 71358, 85550 47808లలో సంప్రదించాలన్నారు.

కవులు ఉమ్మడిగా

గళం విప్పాలి

విజయవాడ కల్చరల్‌: రాజ్యాంగ నైతికతను కవులు భుజానికి ఎత్తుకోవాలని ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్న అన్నారు. మల్లెతీగ సాహిత్యసేవా సంస్థ ఆధ్వర్యంలో బందరురోడ్డులోని బాలోత్సవ్‌ భవన్‌లో ఆదివారం బంగార్రాజు కంఠ రచించిన ‘దుఃఖం పండుతున్న నేల’ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకన్న మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో ఒక లైక్‌ కోసం యువత విలువైన జీవితాన్ని కోల్పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కవులు ఉమ్మడిగా గళం విప్పాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన బిక్కీ కృష్ణ మాట్లాడుతూ దేశంలో క్రమశిక్షణ లోపించందన్నారు. గజల్‌ రచయిత రసరాజు స్ఫూర్తివంతమైన ప్రసంగం చేస్తూ కవికి సొంత డిక్షన్‌ కావాలన్నారు. రచయిత్రి ఘంటసాల నిర్మల, మల్లెతీగ సాహిత్యవేదిక వ్యవస్థాపకుడు కలిమిశ్రీ, కవి విల్సన్‌రావు, పోలీస్‌ అధికారి లోసారి సుధాకర్‌, పుస్తక రచయిత బంగార్రాజు, శిఖా ఆకాష్‌ కవిత్వంలో వస్తున్న మార్పులు అంశంగా మాట్లాడారు.

ఏకగ్రీవంగా నూతన కమిటీ

చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) కృష్ణా జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. మచిలీపట్నం జి–కన్వెన్షన్‌ హాల్‌ వేదికగా జరిగిన జిల్లా కమిటీ ఎన్నికల్లో ఎన్నికల అధికారిగా సంఘ రాష్ట్ర నాయకులు గుళ్లిపల్లి నాగసాయి, కిషోర్‌ వ్యవహరించారు. జిల్లాకు నూతనంగా ఎన్నికై న కార్యవర్గం సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.. అధ్యక్షుడిగా పి. రాము, సహాధ్యక్షుడిగా జి. శ్రీనివాస్‌ రావు, కార్యదర్శిగా తోట వరప్రసాద్‌, ఆర్గనైజేషన్‌ సెక్రటరీగా ఎస్‌. రాంబాబు, వైస్‌ ప్రెసిడెంట్స్‌గా కేవీ లోకేశ్వరరావు, ఎస్‌వీవీ రామారావు, కె. కోటేశ్వరరావు, సీహెచ్‌వీ సత్యనారాయణరావు, వి. సత్యనారాయణ, జాయింట్‌ సెక్రటరీలుగా జి. రామకష్ణ, సీహెచ్‌ఎస్‌ఆర్‌ పవన్‌కుమార్‌, సీహెచ్‌ బ్రహ్మానందబాబు, ఎం. బాలాజీ, పి. ప్రవీణ్‌ కుమార్‌, హుస్సేన్‌, ఎండీ సలీం, ట్రెజరర్‌గా బి. సురేష్‌నాయక్‌బాబులను ఎన్నుకున్నారు.

కృష్ణా తీరాన రామలింగేశ్వరునికి విశేష అభిషేకాలు 1
1/2

కృష్ణా తీరాన రామలింగేశ్వరునికి విశేష అభిషేకాలు

కృష్ణా తీరాన రామలింగేశ్వరునికి విశేష అభిషేకాలు 2
2/2

కృష్ణా తీరాన రామలింగేశ్వరునికి విశేష అభిషేకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement