
ఆంధ్రనాట్యం అద్భుతః
నటరాజుకు నాట్యాభిషేకం..
విజయవాడ కల్చరల్: దృశ్యవేదిక నెలవారీ కార్యక్రమంలో భాగంగా గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథా లయంలో ఆదివారం నాట్యాచార్యుడు పిళ్లా ఉమామహేశ్వర పాత్రుడు బృందం ప్రదర్శించిన ఆంధ్రనాట్యం అంశాలు ఆకట్టుకున్నాయి. ఆంధ్రనాట్య సంప్రదాయ నృత్యం కుంభహారతి, త్రిపుర సంహార శబ్దం, తరంగం, వారాహిస్తుతి, ఉమామహేశ్వర పాత్రుడు రచించిన సంక్షిప్త రామాయణం, దశావతారం అంశాలను ఎస్. మహేష్, పి. మానసతేజ, టి. జ్యేష్ట, కె. సాహితి, ఎం. హర్షిణి, జి. భార్గవి, టి. చిన్మ యి, ఎస్‌కే షర్మిల, పి. జోషిత సాయిలు అభినయించారు. నాట్యాచార్యుడు ఉమామహేశ్వరపాత్రులు మాట్లాడుతూ నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యానికి అంతర్జాతీయ కీర్తిని తీసుకువచ్చారన్నారు. సుసుమ నాగభూషణం రచించి, ఈఎస్ పవన్‌కుమార్ దర్శకత్వం వహించిన కాలజ్ఞానం సాంఘిక నాటికను ప్రదర్శించారు. కళాపరిషత్ నిర్వాహకులు పోపూరి నాగేశ్వరరావు, దృశ్యవేదిక వ్యవస్థాపకుడు హెచ్‌వీఆర్‌ఎస్ ప్రసాద్, బుర్రా నరేన్, నాట్యా చారిణి పద్మశ్రీ హేమంత్, రాయన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రనాట్యం అద్భుతః