
జోయాలుక్కాస్ షోరూమ్ పునఃప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బందరురోడ్డులోని జోయాలుక్కాస్ షోరూమ్‌ను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో వరల్డ్ ఫేవరేట్ జోయాలుక్కాస్ షోరూమ్‌ను ఆధునికీకరించి మూడు అంతస్తుల్లో పునఃప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. షోరూమ్ ప్రతినిధులు మాట్లాడుతూ షోరూమ్ పునఃప్రారంభం సందర్భంగా లక్ష రూపాయలు అంతకంటే ఎక్కువ విలువైన డైమండ్ జ్యూవెలరీ కొనుగోలు చేసిన ప్రతి ఒక్క వినియోగదారుడికి గ్రాము గోల్డ్ కాయిన్ ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ది బ్రిలియన్స్ డైమండ్ జ్యూవెలరీ షో జూన్ 8వ తేదీ వరకు తమ షోరూమ్ లో జరుగుతుందని చెప్పా రు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, సీపీ రాజశేఖరబాబు పాల్గొన్నారు. షోరూమ్ ప్రారంభం సందర్భంగా మోడల్స్ బంగారు ఆభరణాలు ధరించి ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు.
‘గోల్డ్’ శివ..
జోయాలుక్కాస్ షోరూమ్ పునఃప్రారంభం సందర్భంగా పెనమలూరుకు చెందిన కుంచం శివ శంకర సాయి కుమార్ (శివ) అనే వ్యాపారవేత్త సుమారు కోటిన్నర రూపాయలకు పైగా విలువైన బంగారు ఆభరణాలను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. శివ పెనమలూరు సమీపంలోని మురళీనగర్ నివాసి. బంగారం ధరించి బయటకు వచ్చేటప్పుడు ఇంటిలోని కుటుంబసభ్యులు చాలా జాగ్రత్తలు చెప్పి పంపుతారని ‘సాక్షి’తో ఆయన చెప్పారు.

జోయాలుక్కాస్ షోరూమ్ పునఃప్రారంభం