కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

May 24 2025 1:12 AM | Updated on May 24 2025 1:12 AM

కృష్ణ

కృష్ణాజిల్లా

శనివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2025

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం శుక్రవారం 512.50 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 5,598 క్యూసెక్కులు విడుదలవుతోంది.

బెజవాడ నగరంలో డ్రెయినేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చిన్నపాటి వర్షానికే నగరంలో డ్రెయిన్లు పొంగి రహదారులను ముంచెత్తు తున్నాయి. రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చిందంటే కొన్ని రహదారుల్లో ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. కొన్ని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ స్తంభించడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. వర్షాకాలానికి ముందే డ్రెయిన్లు, కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాల్సిన కార్పొరేషన్‌ అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: నగరంలో ఈ ఏడాది మేజర్‌ కాలువలు, డ్రెయిన్లలో పూడికతీత పనుల కోసం మూడు సర్కిల్‌ల పరిధిలో రూ.17కోట్లతో పనులను చేపట్టారు. ఈ పనులు తూతూ మంత్రంగా చేస్తూ చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం అవుతుండటంతో ఈ సీజన్‌లో సైతం నగర వాసులకు కష్టాలు తప్పేలాలేవు. వర్షాలు కురిసినప్పుడు నగరంలో కొన్ని ప్రాంతాల్లో డ్రెయిన్లు పొంగి మురుగునీరు రోడ్లపైకి రావడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం మురుగు నీరు కాలువల్లో సక్రమంగా ప్రవహించేలా, డ్రెయిన్లలో పూడికతీత తొలగించకపోవటమే. ఇప్పటికే నగర కమిషనర్‌ పలు ప్రాంతాల్లో పర్యటించి నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగకుండా క్షేత్ర స్థాయిలో ఆయా శాఖాధిపతులు పర్యటించి డ్రెయిన్లలో నీరు నిలువకుండా ఉండే విధంగా ఉన్న అడ్డంకులను తొలగించాలని ఆదేశించారు. కాని ఆచరణలో మాత్రం అమలు కావటం లేదు. జాతీయ రహదారి పైనుంచి వచ్చే వర్షపునీరు సర్వీసు రోడ్డుపై నిలిచిఉండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. అవుట్‌ ఫాల్‌ డ్రైన్లను పరిశీలించి వర్షపు, మురుగునీరు ప్రవాహానికి ఆటంకం లేకుండా చేయడంలో సిబ్బంది విఫలం అవుతున్నారు.

నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం

నగరంలో డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతోనే, గత ఏడాది సెప్టెంబరులో కురిసిన వర్షాలకు బుడమేరు పొంగింది. దీంతో నరగంలో పలు కాలనీలు జలమయం అయ్యాయి. వారం రోజులకు పైగా నీరు కాలనీల నుంచి వెళ్లక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోకుండా నగరంలో ప్రధాన డ్రైన్లు గుంటతిప్ప, పుల్లేరు, బుడమేరులో నామమాత్రంగా పూడిక తీశారు. దీంతో ప్రధానంగా డ్రైన్లు ప్రవహించే లబ్బీపేట, పిన్నమనేని పాలిక్లినిక్‌, గాయత్రినగర్‌, ఎల్‌ఐసీ కాలనీ, ఎన్టీఆర్‌ కాలనీ, గుణదల, భారతినగర్‌, గురునానక్‌ కాలనీ, మారుతి కో–ఆపరేటివ్‌కాలనీ, భారతినగర్‌, ఆటోనగర్‌, అజిత్‌సింగ్‌ నగర్‌, మధురానగర్‌ ,పాయకాపురం, బెంజి సర్కిల్‌, పంటకాలువ రోడ్డు, తోట వారి వీధి, ఊర్మిళా నగర్‌, నిర్మల కాన్వెంట్‌ రోడ్డు, కృష్ణవేణి రోడ్డు, రమేష్‌ ఆస్పత్రి ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షానికే రోడ్లపై మురుగు, వర్షపునీరు పొంగి ప్రవహిస్తోంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.ఎక్కడ రోడ్డు ఉందో ఎక్కడ డ్రెయిన్‌ ఉందో తెలియక పాద చారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నిధులు ఖర్చు చేసినా...

ఈ ఏడాది వేసవిలో డ్రైన్లలో పేరుకుపోయిన చెత్త, చెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించేందుకు విజయవాడ నగర వ్యాప్తంగా ఉన్న మేజర్‌ అవుట్‌ ఫాల్‌ డ్రెయిన్ల నుంచి సైడు డ్రైన్ల వరకు సిల్టు తీయటానికి వీఎంసీ రూ.17 కోట్లు వీఎంసీ సాధారణ నిధుల నుంచి కేటాయింపులు జరిపారు. సిల్టు తొలగింపునకు కార్మికులు లేకపోవటం, ఉన్న కార్మికులు సుదీర్ఘ సెలవులపై ఉండటంతో గ్యాంగ్‌వర్క్‌ పనులు ఆలస్యం అవుతున్నాయని అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ సరైన ప్రణాళిక, డ్రైన్ల రూట్‌మ్యాప్‌, డ్రైన్లపై ఏర్పాటు చేసిన గేజ్‌ల నిర్వహణ లేకపోవటం, డ్రైన్లపై అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టటంతో సిల్టు తొలగింపు ప్రహసనంగా మారింది. నగరవ్యాప్తంగా ప్రతి రోజు వచ్చే 250 మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలన్నీ అధికంగా డ్రెయిన్లు, కాల్వల్లోనే సేకరించటానికి ప్రధాన కారణం వ్యాపార సముదాయాలు, వాణిజ్య ప్రాంతా ల్లో డ్రెయిన్లపై ఇనుప గేజ్‌లు ఏర్పాటు వలనే జరుగుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

విజయవాడ మిల్క్‌ప్రాజెక్ట్‌ సమీపంలో పేరుకుపోయిన చెత్తచెదారం

9

తీరానికి తాళం ముందస్తు ప్రకటన లేకుండా అధికారులు హంసలదీవి తీరం గేట్లను మూసివేశారు. దీంతో పర్యాటకులు గంటల తరబడి నిరీక్షించి, నిరాశతో వెనుదిరిగారు

న్యూస్‌రీల్‌

చెత్త, వ్యర్థాలతో నిండిపోతున్న డ్రెయిన్లు

కొద్దిపాటి వర్షానికే

పొంగి పొర్లుతున్న వైనం

రోడ్లపైనే భారీగా నిలుస్తున్న వర్షపు నీరు

నగరవాసులకు తప్పని తిప్పలు

అంతంత మాత్రంగానే డీసిల్టింగ్‌ పనులు

విజయవాడ నగరంలో మురుగునీరు పారుదలకు, వర్షంనీటి పారుదలకు నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 142 కిలోమీటర్ల మేర మేజర్‌ అవుట్‌ఫాల్‌ డ్రైన్లు, 302 కిలోమీటర్ల మైనర్‌ డ్రైన్లు నిర్మాణమయ్యాయి. నగరంలోని సర్కిల్‌–1 పరిధిలో వించిపేటలో, సర్కిల్‌–2 పరిధిలోని అజిత్‌సింగ్‌నగర్‌లో, సర్కిల్‌–2 పరిధిలోని గుణదలలోని పుల్లేటి కాల్వ నుంచి నగరంలోని మురుగునీరు, వర్షంనీరు బందరు, ఏలూరు, రైవస్‌, బుడమేరుల్లో కలుస్తున్నాయి. డ్రెయిన్లలో వచ్చే ఇతర వ్యర్థాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాల కారణంగా కాల్వల్లో మురుగునీరు ముందుకు పారటంలేదు. దీనికితోడు ప్రతి ఏడాది వేసవిలో చేపట్టాల్సిన డీసిల్టింగ్‌ పనులు కూడా అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. మూడు సర్కిళ్ల పరిధిలోని ప్రధాన అవుట్‌ఫాల్‌ డ్రెయిన్లలో ఎప్పటికప్పుడు సిల్టు, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించడంలో నరగపాలక సంస్థ అధికారులు విఫలం అవుతున్నారు. వరద నీరు డ్రెయిన్లలో సరిగా ప్రవహించకపోవడంతో నీరు వెనక్కి తన్ని కాలనీలు, రోడ్లు జలమయం అవుతున్నాయి.

కృష్ణాజిల్లా1
1/5

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా2
2/5

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా3
3/5

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా4
4/5

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా5
5/5

కృష్ణాజిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement