ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి

Oct 13 2026 12:05 AM | Updated on Oct 13 2026 12:05 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాల ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. ఖమ్మంలోని వ్యవసాయ క్షేత్రం నుంచి మంత్రి, హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్షి సంజయ్‌ జాజు, ఇతర కార్యదర్శులతో కలిసి సోమవారం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికా రులు, గ్రామీణ అభివృద్ధి, ఉద్యానవనశాఖ, పశుసంవర్ధక శాఖ, ఇతర అధికారులతో ఎల్‌నినో ప్రభా వంతో సాగునీటి, తాగునీటి, విద్యుత్‌ వాడకం, పశుగ్రాసం, వీబీ జీరామ్‌ జీ పథకం ద్వారా జలసరి కింద ఫామ్‌పాండ్‌, ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, ఊట కుంట నిర్మాణంపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కరువు పరిస్థితులు, నీటి ఎద్దడి, వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధ చేసుకోవాలని సూచించారు. రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ తాగునీటి కొరత లేకుండా చూడాలని, విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా వ్యవస్థను సమన్వయం చేసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదిక నుంచి అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి కలెక్టర్‌ కె.హరిత మాట్లాడారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల సాగ ుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం ఆదర్శ రైతు ప్రశాంత్‌ రామ్మోహన్‌ ఆరుతడి పంటతో వచ్చే లాభాలను వివరించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, డీఏవో వెంకట్‌, ఉద్యానవన శాఖ అధికారి నదీమ్‌ ఉద్దీన్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ ఇరుకుల్ల మంగ, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement