ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా ప్రజలు ప్రజాసేతు యాప్ వాట్సాప్ నం.75699 86036 ద్వారా సమస్యలపై ఇంటి నుంచే దరఖాస్తులు చేసుకోవచ్చని కలెక్టర్ కె.హరిత తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్‌తో కలిసి ప్రజాసేతు యాప్ సేవలను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం, ప్రజా సమస్యల పరిష్కార ప్రక్రియను సులభతరం చేయడం, సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా చేయడమే లక్ష్యంగా ప్రజాసేతు సేతు యా ప్‌ను ప్రారంభించామని తెలిపారు. జిల్లా యంత్రాంగం kbasifabad.in వెబ్‌సైట్‌ను అందుబా టులోకి తీసుకువచ్చిందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో దాసరి వేణు, అధికారులు పాల్గొన్నారు.


