కౌటాల: 20 గంటల పాటు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని కౌటాల– కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై సోమవారం రైతులు రాస్తారోకో చేపట్టారు. వారసంత కావడంతో ప్రధాన రహదారిపై పదుల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై సతీశ్ ఘటనాస్థలికి చేరుకుని రైతులతో చర్చించారు. రైతులు మాట్లాడుతూ తాటిపల్లి, గుండాయిపేట, మొగడ్‌దగడ్, గుడ్లబోరి, తుమ్మిడిహెట్టి ప్రాంతాల్లో సాగు చేస్తున్న మిరప పంటలు ఎండిపోయే స్థితిలో ఉన్నాయని తెలిపా రు. ప్రస్తుతం కేవలం 8 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. వరితోపాటు మిరపకు నీటి తడులు అందించేందుకు కోతలు లేకుండా త్రీఫేజ్ కరెంట్ సరఫరా చేయాలని కోరా రు. కౌటాల ఏఈ అంజల్‌కుమార్ 15 గంటల పా టు విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించడంతో రాస్తారోకో విరమించుకున్నారు. కార్యక్రమంలో రైతులు ఆనంద్‌రావు, బాబురావు, దామోదర్, మనోహర్, గణపతి, ధర్మయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు.


