ఆసిఫాబాద్‌అర్బన్: విద్యార్థి దశ నుంచే వన్యప్రాణు ల సంరక్షణపై అవగాహన పెంచుకోవాలని డిప్యూ టీ రేంజ్ అధికారి యోగేశ్ అన్నారు. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని పీటీజీ బాలుర పాఠశాలలో ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వి ద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, వాతావరణ స మతుల్యం వంటి అంశాలపై అవగాహన ఉండాలన్నారు. తల్లిదండ్రులకు కూడా వన్యప్రాణుల ప్రాధాన్యతను వివరించాలని సూచించారు. పోటీల్లో 40 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. విజేతలకు ఈ నెల 8న బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు మహేందర్, ప్రకాశ్, ప్రిన్సిపాల్ సుజాత, వార్డెన్ కృష్ణచారి పాల్గొన్నారు.


