ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులు కాంట్రాక్టర్ హామీతో సోమవారం సమ్మె విరమించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ కిరణ్ భీమ్ సొసైటీ కాంట్రాక్టర్ రత్నం శ్రీకాంత్‌కు నోటీసులు అందించారు. దీంతో స్పందించిన కాంట్రాక్టర్ కార్మికులను చర్చలకు ఆహ్వానించా రు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుంటామని హామీ ఇచ్చి, విధుల కు హాజరు కావాలని కోరాడు. దీంతో తిరిగి విధుల్లో చేరేందుకు అంగీకరించారు.


