● వరిలో ఎండు తెగులు ఉధృతి ● మందులు పిచికారీ చేసినా అదుపులోకి రాని వైనం ● దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం | - | Sakshi
Sakshi News home page

● వరిలో ఎండు తెగులు ఉధృతి ● మందులు పిచికారీ చేసినా అదుపులోకి రాని వైనం ● దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం

Oct 5 2026 11:54 PM | Updated on Oct 5 2026 11:54 PM

● వరిలో ఎండు తెగులు ఉధృతి ● మందులు పిచికారీ చేసినా అదుపులోకి రాని వైనం ● దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం

నత్రజని ఎరువుల వాడకం తగ్గించాలి. భూమిలో యూరియా ఎక్కువైతే తెగుళ్ల ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతానికి యూరియా వాడకం తగ్గించాలి.

పొలంలో నిరంతరం నీరు నిల్వ ఉంచొద్దు. పొలం ఆరిన తర్వాతే మళ్లీ నీరు పెట్టడం మంచిది.

తెగుళ్లు కనిపిస్తే వెంటనే అధికారులు సిఫారసు చేసిన మందులను పిచికారీ చేయాలి.

ట్రై సైక్లజోల్‌ 75శాతం లీటరు నీటికి 0.6 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. లేదా ఇసోప్రోధియేలెన్‌ 40శాతం ఈసీ లీటరు నీటికి 105 మి.లీ. చొప్పున కలిపి కొట్టాలి.

ఎండు ఆకు తెగులు నివారణకు సీవోసీ, ఫ్లాంటామైసిన్‌ మందును వారానికి రెండుసార్లు పిచికారీ చేయాలి.

దహెగాంలో తెగులు సోకిన వరి

దహెగాం మండల కేంద్రానికి చెందిన ఆసంపల్లి రాజు పెద్ద చెరువు కింద వరి సాగు చేశాడు. పైరు ఎర్రబారి ఎండిపోయిట్లు కనిపిస్తుంది. ఇప్పటికే నివారణ మందులు మూడుసార్లు పిచికారీ చేసినా తెగుళ్లు అదుపులోకి రాలేదు. తెగుళ్ల ఉధృతి ఇలాగే కొనసాగితే దిగుబడిపై ప్రభావం పడుతుందని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

దహెగాం: వరి సాగు చేసిన రైతులను తెగుళ్లు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. వాతావరణ మార్పులకు తోడు గాలిలో తేమశాతం పెరగడం, రాత్రిపూట మంచు కురుస్తుండటంతో అగ్గి తెగులు వేగంగా విస్తరిస్తోంది. ఆకులపై మచ్చలు ఏర్పడి పంటలు ఎండిపోయినట్లుగా మారుతోంది. రసాయన మందులు పిచికారీ చేసినా తెగుళ్లు అదుపులోకి రావడం లేదని అన్నదాతలు చెబుతున్నారు.

ఆలస్యంగా వరినాట్లు

జిల్లాలో గతేడాది 56 వేల ఎకరాల్లో వరి సాగు చే యగా, ఈ వానాకాలం సీజన్‌లో 35,452 ఎకరాల కు మాత్రమే పరిమితమైంది. ఎల్‌నినో ప్రభావంతో సుమారు 20 వేల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది. వర్షాభావ పరిస్థితులతో కుంటలు, చెరువుల కింద నాట్లు వేయలేదు. వర్షాల తీరుతో ఈ ఏడాది వరినా ట్లు ఆలస్యమయ్యాయి. ఆగస్టు నెలాఖరు వరకు కూడా నాట్లు కొనసాగాయి. ఫలితంగా వరిపైరులో ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేదు. అలాగే తెగు ళ్ల ఉధృతి ఎక్కువగా ఉంది. కంకి దశకు వస్తున్న క్రమంలో ఎండు ఆకు తెగులు ఎక్కువగా సోకుతోంది. ఆకులపై మచ్చలు ఏర్పడి అది కింది వరకు చేరి పైరు పసుపు రంగులోకి మారుతోంది. యూరియా అధిక వాడకంతోనూ తెగుళ్ల ఉధృతి కనిపిస్తోందని వ్యవసాయధికారులు చెబుతున్నారు.

రెండుసార్లు పిచికారీ చేయాలి

ప్రస్తుతం వరికి ఎండు తెగులు సోకుతోంది. రైతులు ముందుగానే గుర్తించాలి. సీవోసీ, ఫ్లాంటామైసిన్‌ మందును వారానికి రెండుసార్లు పిచికారీ చేయాలి. తద్వారా తెగులు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా నివారించవచ్చు. అగ్గి తెగులు కూడా సోకే అవకాశం ఉంటుంది. రైతులు నిర్లక్ష్యం చేయకుండా వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనలు పాటించాలి.

– వెంకట్‌, జిల్లా వ్యవసాయాధికారి

తెగుళ్ల నివారణ చర్యలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement