రెబ్బెన: ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆసిఫాబా ద్ జిల్లా ఏరియా ఇన్‌చార్జిగా రెబ్బెన మండలం గోలేటికి చెందిన కేసరి ఆంజనేయులు గౌడ్ నియమితులయ్యారు. ఆయన మా ట్లాడుతూ విద్యార్థులు, యువత, మహిళలు, వ్యాపారులు, ఉద్యోగుల్లో వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్ష్యణాలు, వ్యక్తిత్వ నైపుణ్యాల ను పెంపొందించేందుకు విస్తృతంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉ చిత నైపుణ్యాభివృద్ధి, ట్రైన్ ది ట్రైనర్, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత మందికి చేరువ చేస్తామన్నారు. ఇంపాక్ట్ ఇంటర్నేషన ల్ వ్యవస్థాపకుడు గంపా నాగేశ్వర్‌రావు, జాతీయ అధ్యక్షుడు ఆర్‌వీఆర్, ఉపాధ్యక్షుడు మహేందర్, రీజియర్ 20 అధ్యక్షురాలు స్వాతి ఆధ్వర్యంలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.


