కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలోని శ్రీసరస్వతి శిశుమందిర్ విద్యార్థులు గణిత విజ్ఞాన మేళాలో ప్రతిభ చూపారు. ఈ నెల 2 నుంచి 4 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని నూతక్కి ప్రాంతంలో నిర్వహించిన దక్షిణ మధ్య క్షేత్రస్థాయి విజ్ఞాన ప్రదర్శనలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అన్నం ఆదిత్య ద్వితీయ స్థానం(సైన్స్ ప్రదర్శన), వేద గణిత ప్రశ్నమంచ్‌లో 9వ తరగతి విద్యార్థి షేక్ సొహెల్ పాషా, కనుకుంట్ల స్పంద, శ్రీ వర్షిణి తృతీయ స్థానంలో నిలిచారు. విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.


