ఆసిఫాబాద్‌అర్బన్: బీసీ కులగణన చేస్తామని ప్రకటించినా.. ప్రస్తుతం శాసీ్త్రయ పద్ధతిలో కు లగణన చేపట్టకుండా బీసీలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్‌నార్ రమేశ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఓబీసీ కుటుంబాలను సమగ్రంగా లెక్కించాలని, ప్రత్యేక బీసీ కాల మ్ ఏర్పాటు చేసి, ప్రతీ కులానికి యూనిక్ కోడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లోబడె లహుకుమార్, పట్టణ అధ్యక్షుడు సాయికృష్ణ, నాయకులు అసద్, జయరాజ్, వెంకన్న, ముబీన్ తదితరులు పాల్గొన్నారు.


