ఆసిఫాబాద్: పల్లెల్లో గంజాయి సాగు ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు రైతులు అత్యాశతో పత్తి, ఇతర పంటల్లో అంతర పంటగా సాగు చేస్తున్నారు. నియంత్రణకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా సాగుదారుల తీరు మాత్రం మారడం లేదు. ఈ నెల 13న జైనూర్ మండలం పాట్నాపూర్‌లో పోలీసులు రూ.1.50 కోట్ల విలువైన 1245 మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు స్థానిక పోలీసులు పాట్నాపూర్ మెయిన్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అంబురే పుండలిక్ వద్ద 11 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. పోలీసులు లోతుగా విచారించగా కొడుకు రమేశ్‌తో కలిసి పత్తిలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. గంజాయి మొక్కలను వేర్లతో సహ పీకి స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేశారు. గడిచిన మూడేళ్లలో జిల్లాలో 150 కేసులు నమోదు కాగా, రూ.80,39,327 విలువ చేసే 326.2605 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.3,18,80,000 విలువైన 2,995 మొక్కలు పట్టుకున్నారు. మొత్తంగా 296 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో తొమ్మిది మంది మైనర్లు ఉండటం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1.50 లక్షల విలువ చేసే ఎండు గంజాయి, 1600 మొక్కలు స్వాధీనం చేసుకుని 68 మందిని అరెస్టు చేశారు.
ఇటీవల నమోదైన కేసులు
పెరుగుతున్న సాగు
సాగు చేస్తే కఠిన చర్యలు
జిల్లాలో గంజాయి సాగు చేస్తే కఠిన శిక్షలు తప్పవు. మాదక ద్రవ్యాల అక్రమ సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలి. గంజాయి సాగు, క్రయవిక్రయాలు, వినియోగం గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
– నితిక పంత్, ఎస్పీ
గంజాయి నియంత్రణలో భాగంగా పోలీసు, ఎకై ్సజ్‌శాఖ ఆధ్వర్యంలో నిత్యం తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పట్టుబడిన రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేయడంతోపాటు పీడీ యాక్టు నమోదు, పట్టాలు రద్దు చేస్తామని పోలీసులు ప్రకటించారు. గతంలో 46 మందికి రైతు బంధు పథకం సైతం నిలిపివేశారు. కానీ కొందరు రైతులు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో గంజాయి మొక్కలను అంతర పంటగా గుట్టుగా సాగు చేస్తున్నారు. తక్కువ వ్యవధిలో అధిక లాభాలు గడించవచ్చనే అత్యాశతో మొక్కలు పెంచుతున్నారు. ఫలితంగా జిల్లాలో ఇంకా గంజాయి సాగు కొనసాగుతూనే ఉంది.


