ఆసిఫాబాద్‌రూరల్: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులను మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కె.హరిత అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ తాను కూడా సాఫ్ట్‌బాల్ ప్లేయర్‌నని, జిల్లా క్రీడాకారులు బంగారు పతకం సాధించడం ఆనందంగా ఉందన్నారు. జాతీ యస్థాయిలోనూ రాణించాలని ఆకాక్షించారు. కాగా, ఈ నెల 11 నుంచి 13 వరకు జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు హర్షిత్, జైశ్రీరాం, అనికేత్, సంకేత్, సూర్యవంశీ ఆదర్శ్, రాష్టపాల్ పాల్గొన్నారని ప్రిన్సిపాల్ రహీం తెలిపారు. జాతీ యస్థాయికి ఎంపికైన రాష్టపాల్ ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీలు యాదగిరి, ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, ఖేలో ఇండియా కోచ్ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.


