బాలల రక్షణకు ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

బాలల రక్షణకు ప్రత్యేక చర్యలు

Sep 16 2026 4:07 AM | Updated on Sep 16 2026 4:07 AM

● కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌: లైంగిక నేరాల నుంచి బాలలను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని.. లైంగిక వేధింపులు పాల్పడే వారిపై, అశ్లీల చిత్రాల కోసం పిల్లలను ఉపయోగించే వారిని గుర్తించి పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం పోలీస్‌, రెవెన్యూ, శిశు సంక్షేమ, వైద్యారోగ్య, విద్య, పంచాయతీరాజ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాల నిషేధిత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. మిషన్‌ వాత్సల్య కార్యక్రమం కింద బాల్య వివాహాల నిషేధిత చట్టం, పోక్సో చట్టాన్ని అమలు చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రజలతోపాటు పాఠశాలలు, కళాశాలల్లో బాల్య వివాహాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని, సర్పంచులు, స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వాములు చేయాలని ఆదేశించారు.

పోషణ మాసం అమలుపై సమీక్ష

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మన అంగన్‌వాడీ– మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా పోషణ మాసంపై కలెక్టర్‌ అధికారులతో సమీక్షించారు. వచ్చే నెల 8 వరకు కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కేంద్రాల్లో పోషకాహారం అందించాలని, మూడేళ్లలోపు పిల్లలు విధిగా అంగన్‌వాడీ కేంద్రాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పోషణ మాసానికి సంబంధించిన పోస్టర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి, డీపీవో భిక్షపతి, డీఐఈవో రాందాస్‌, డీడీపీవోలు, సఖి, బాలల రక్షణ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement