క్రీడలతో మానసిక ప్రశాంతత | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసిక ప్రశాంతత

Sep 16 2026 4:07 AM | Updated on Sep 16 2026 4:07 AM

రెబ్బెన: క్రీడలతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ప్రతిఒక్కరూ సాధనకు సమయం కేటాయించాలని ఖైరిగూర ప్రాజెక్టు అధికారి మచ్చగిరి నరేందర్‌ అన్నారు. డబ్ల్యూపీఎస్‌ అండ్‌ జీఏ వార్షిక క్రీడల్లో భాగంగా గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి పాఠశాల మైదానంలో సోమవారం డిపార్ట్‌మెంటల్‌ స్థాయి వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులు దైనందిన జీవితంలో గంటపాటు మైదానంలో గడిపితే ఆరోగ్యంగా ఉంటారన్నారు. సెల్‌ఫోన్‌ వాడకం తగ్గించి నిత్యం నచ్చిన ఆట కోసం సమయం కేటాయించడం అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. అనంతరం ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. కాగా, ఎస్వోటూజీఎం జట్టుపై ఖైరిగూర పీవో జట్టు విజయం సాధించింది. ఆయా కార్యక్రమాల్లో ఏఐటీయూసీ నాయకులు బయ్య మొగిళి, డబ్ల్యూపీఎస్‌ అండ్‌ జీఏ గౌరవ కార్యదర్శి ప్రశాంత్‌, స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ కిరణ్‌బాబు, జనరల్‌ కెప్టెన్‌ అబ్బాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement