ఆ క్షణం కళ్లల్లో ఆనందం చూశాను.. | - | Sakshi
Sakshi News home page

ఆ క్షణం కళ్లల్లో ఆనందం చూశాను..

Jun 21 2026 12:55 AM | Updated on Jun 21 2026 12:55 AM

● నాన్నతో స్నేహబంధం ● బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌

నాన్న.. జీవితాన్ని సరైన దారిలో నడిపించే మార్గదర్శి. అపజయాలు ఎదురైనా ధైర్యం చెప్పి విజయాన్ని అందించే దిక్సూచి. ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లల విజయాలే తనవిగా భావించి సంతోషిస్తాడు. బిడ్డల ఎదుగుదలలో తన కష్టాలను మెట్లుగా మలిచి ఉన్నత స్థానాలకు చేర్చి ఆనందిస్తాడు. తన భుజాలపై ఎక్కించుకుని లోకాన్ని చూపించే నాన్నకు వందనం. నేడు ఫాదర్స్‌ డే సందర్భంగా.. తండ్రి ప్రోత్సాహంతో ఉన్నతస్థానాలకు చేరిన వారిపై ప్రత్యేక కథనం.

బెల్లంపల్లి: ‘నాన్న ప్రేమ ఎల్లలు లేనిది.. దేనితోనూ వెలకట్టలేనిది. చిన్నతనం నుంచి మొదలుకుని ఐఏఎస్‌ పాసయ్యే వరకు నాన్నతో నా జర్నీ ఫ్రెండ్స్‌లా సాగింది. నా చిన్నతనంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ నాన్న నా బెడ్‌ పక్కనే ఉండి సపర్యలు చేయడం నేనెప్పటికీ మర్చిపోలేను..’ అంటూ బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ ఐఈఎస్‌ఎస్‌డీ. మనోజ్‌ గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఫాదర్స్‌ డే సందర్భంగా ఆయన తన తండ్రి ఇనుకొండ వెంకటేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. మా స్వస్థలం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అనంతారం గ్రామం. నాన్న ఇనుకొండ వెంకటేశ్వరరావు(రిటైర్డు పోలీసు అధికారి), అమ్మ గంగభవానీ, అక్క లక్ష్మీమౌనిక.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement