వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వినతి | - | Sakshi
Sakshi News home page

వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వినతి

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

రెబ్బెన: కారుణ్య నియామకాల్లో భాగంగా మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని టీబీజీకేఎస్‌ బెల్లంపల్లి ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. గోలేటి సీహెచ్‌పీలో బుధవారం టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి డీవైజీఎం కోటయ్యకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ఏఐటీయూసీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్మికులను నమ్మించి మోసం చేసిందన్నారు. ఏడాదిగా మెడికల్‌ బోర్డు నిలిపివేసి మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగ నియామకపత్రాలు అందించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. స్పందించని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సెంట్రల్‌ కమిటీ నాయకులు శ్రీనివాస్‌, ఏరియా నాయకులు విద్యాసాగర్‌, మురళీ, అజాబ్‌, శ్రీని వాస్‌, చిరంజీవి, జ్యోతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement