హామీలు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

హామీలు అమలు చేయాలి

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

రెబ్బెన: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగి న మలిదశ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లి న ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హా మీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు అజ్మీర బా బురావు అన్నారు. ఉద్యమకారులు అజ్మీర బాబురావు, బోగే ఉపేందర్‌, కోట రాజయ్య, దుర్గం రవీందర్‌, సోగాల వామన్‌లను బుధవారం గోలేటిలో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసే కుట్రలో భాగంగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిందన్నారు. హామీ మేరకు పెన్షన్‌, ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్లు అందించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ దుర్గం తిరుపతి, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు అరుణ్‌, సాంబగౌడ్‌, పంచాయతీ కార్యదర్శి రవీందర్‌, కారోబార్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement