ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో ఈ నెల 20న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ వీరయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టు కార్యాలయంలో సీనియర్ సివిల్ జడ్జి సంకేత్ మిత్రతో కలిసి బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీ పడే క్రిమినల్, సివిల్, ప్రీ లిటిగేషన్ కేసులు, బ్యాంకు, ఎలక్ట్రిసిటి, భూతగాదాలు, వివా హ, కుటుంబ తగాదాలు, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ కేసులు, చిట్‌ఫండ్, చెక్‌బౌన్స్ కేసులు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


