రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా నూతన జనరల్ మేనేజర్‌గా బదిలీపై వచ్చిన శ్రీరమేశ్ బుధవారం గోలేటిలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు జీఎంగా పనిచేసిన విజయ భా స్కర్‌రెడ్డి పదవీ విరమణ పొందగా.. ఆయన స్థానంలో మణుగూరు ఏరియా నుంచి బది లీపై వచ్చిన శ్రీరమేశ్‌కు అధికారులు స్వాగ తం పలికారు. జీఎం మాట్లాడుతూ గతంలో ఏరియాలో పనిచేసిన అనుభవం ఉందన్నా రు. ఉత్పత్తిలో ఏరియాను మొదటిస్థానంలో నిలిపేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అధికారుల సంఘం అధ్యక్షుడు మచ్చగిరి నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఇన్‌చార్జి ఎస్వోటూజీఎం ఉమాకాంత్, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.


