● ఎస్పీ నితిక పంత్
ఆసిఫాబాద్: ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లతో రక్షణ ఉంటుందని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. కంచుకోట, గాంధీచౌక్, ప్రభుత్వ ఆస్పత్రి, పైకాజీనగర్ మీదుగా మెయిన్ రోడ్ వరకు రోడ్డు భద్రతా పరిస్థితులు పరిశీలించారు. ద్విచక్ర వాహనదారులను ఆపి హెల్మెట్ ధరించాలని సూచించారు. మ ద్యం తాగి వాహనాలు నడిపితే ప్రాణపాయం ఏర్పడుతుందని, కుటుంబ సభ్యులకు తీరని నష్టం జరుగుతుందని తెలిపారు. ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా హెల్మె ట్ ధరించి ప్రయాణిస్తున్న వాహనదారులను అభినందిస్తూ ‘బెస్ట్ సిటిజన్స్ ఇన్ ఆసిఫాబాద్’గా కొని యాడారు. మెరుగైన సేవలందించేందుకు సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ కార్యాలయాల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వర కు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపా రు. ప్రజలు నేరుగా ఫిర్యాదులు, సమస్యలను అధి కారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ అశోక్, సీఐ బాలాజీ వరప్రసాద్, ఇన్‌స్పెక్టర్లు రమేశ్, వేణుగోపాల్, ఎస్సైలు మధుకర్, రవికుమార్, విక్రమ్, మహేందర్, ఉల్లాస్, శ్యా మ్‌రావు, మోహన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
సిబ్బంది సమయపాలన పాటించాలి
ఆసిఫాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల కార్యాలయాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్లు పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో మాట్లాడుతూ చెరువులు, కాలువల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.


