విద్యార్థులకు వరం.. శిక్షణ శిబిరం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు వరం.. శిక్షణ శిబిరం

Apr 26 2026 2:15 AM | Updated on Apr 26 2026 2:15 AM

● వేసవిలో వివిధ అంశాల్లో ట్రైనింగ్‌ ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● ప్రత్యేక నిపుణుల నియామకం

సిర్పూర్‌(టి): సాంఘిక సంక్షేమ బాలురు, బాలికల వసతిగృహాల్లోని విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్ర భుత్వం వేసవిలో నెలపాటు వేసవి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఏప్రిల్‌ 25నుంచి మే 25వరకు నిర్వహించనున్న శిక్షణ కేంద్రాల్లో విద్యార్థులకు వివి ధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. వేసవి శిక్షణ శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చే యగా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని సాంఘిక సంక్షేమ బాలురు, బాలికల వసతి గృహాల్లో చదివే పలువురు విద్యార్థులు వేసవి శిక్షణ కేంద్రాలకు తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ కేంద్రానికి ఇత ర జిల్లాల నుంచి విద్యార్థులు రానున్నారు. కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లాలోని సిర్పూర్‌ (టి) సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం, బా బాసాగర్‌, వాంకిడి, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌లోని బాలుర వసతి గృహాల విద్యార్థులు, సాంఘిక సంక్షే మ సమీకృత వసతిగృహం సిర్పూర్‌(టి), బాలికల వసతిగృహం ఆసిఫాబాద్‌ విద్యార్థినులు తమకు కే టాయించిన కామారెడ్డి, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌లోని ప్రత్యేక శిక్షణ కేంద్రాలకు వెళ్లారు.

గతంలో సాంఘిక సంక్షేమ గురుకులాలకే..

గతంలో రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ బాలురు, బాలికల గురుకులాల విద్యార్థులకే వేసవిలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. ఈసారి సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకూ ప్ర త్యేకంగా అదే శాఖ ఆధ్వర్యంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వా రు ఆసక్తి కనబరుస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక నిపుణులతో..

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి నెలపాటు ఇచ్చే వేసవి శిక్షణకు వివిధ రంగాల్లోని ప్రత్యేక నిపుణులను నియమించారు. విద్యార్థులకు మెరుగైన బోధన, క్రీడల్లో నైపుణ్యాలు గుర్తించడం, క్రీడలపై ప్రత్యేక శిక్షణ, కంప్యూటర్‌ విద్య తదితర రంగాల్లో విద్యార్థులకు ప్ర త్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. అలాగే, విద్యార్థులు ఉండేందుకు వ సతి ఏర్పాటు చేయగా నాణ్యమైన భోజనం, ప్రత్యేక మెనూ అమలుకు ఏర్పాట్లు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement