ఆసిఫాబాద్: ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని డీఆర్డీవో దత్తారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కా ర్యాలయంలో బుధవారం ఎంపీడీవో శ్రీని వాస్, ఎంపీవో బుచ్చన్నతో కలిసి డివిజన్‌లోని క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఆర్డీవో మాట్లాడుతూ కూలీల సంఖ్య పెంచుతూ, వేసవి దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పనులు కల్పించాలన్నారు. ప్రతీ పంచాయతీలో కనీసం వందమంది కూలీలు పనిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం ద్వారా కూలీల హాజరు పక్కాగా నమో దు చేయాలన్నారు. నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేసేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు.


