31లోగా పన్నులు వసూలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

31లోగా పన్నులు వసూలు చేయాలి

Mar 27 2026 9:17 AM | Updated on Mar 27 2026 9:17 AM

కెరమెరి: పంచాయతీల్లో ఈ నెల 31లోగా పన్నులు వసూలు చేయాలని డీఎల్‌పీవో ఉమర్‌ హుస్సేన్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులతో సమవేశమయ్యారు. వసూలుకు మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉండగా, ఇప్పటివరకు 87 శాతం పూర్తయినట్లు తెలిపారు. బకాయిలపై దృష్టి సారించి లక్ష్యం చేరుకోవాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని, చేతిపంపులకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జి ఎంపీడీవో సాయిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement