దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Mar 29 2026 6:58 AM | Updated on Mar 29 2026 6:58 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో ఖాళీగా ఉన్న మూడు వైద్యాధికారుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌వో సీతారాం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఎం జన్‌మన్‌ పథకం కింద ఒప్పంద ప్రతిపాదికన పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హతల వివరాలు https: //asifabad.telangana.gov. inలో పొందిపర్చినట్లు వెల్లడించారు. ఈ నెల 30లోగా స్థానిక వైద్యకళాశాలలో అర్హత పత్రాలు, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో కౌన్సెలింగ్‌కు హాజ రుకావాలని సూచించారు.

25 మంది గైర్హాజరు

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో శనివా రం నిర్వహించిన పదోతరగతి గణితం పరీక్షకు 6,950 మంది విద్యార్థులకు 6,925 మంది హాజరు కాగా 25 మంది గైర్హాజరయ్యారని పరీక్షల నిర్వహణ అధికారి జనార్దన్‌ తెలిపా రు. అలాగే 114 మంది ప్రైవేట్‌ విద్యార్థులకు 106 మంది హాజరయ్యారు. కాగజ్‌నగర్‌లోని పలు కేంద్రాలను డీఈవో లలిత సందర్శించారు.

వేసవి డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా

ఆసిఫాబాద్‌: వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తామని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఉత్తం జాడే ఒక ప్రకటనలో తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని గతేడాది చివరి నుంచే అప్రమత్తమై ఏ విపత్తు ఎదురైనా నిరంతరాయంగా విద్యుత్‌ అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతతో సేవలందిస్తున్నామన్నారు. వినియోగదారులు కార్యాలయాల బాట పట్టకుండా వాట్సాప్‌ చాట్‌బాట్‌, విద్యుత్‌ ప్రజావాణి, 1912 టోల్‌ఫ్రీ నంబర్‌ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement