6న ఆదిలాబాద్‌కు సీఎం | - | Sakshi
Sakshi News home page

6న ఆదిలాబాద్‌కు సీఎం

Mar 29 2026 6:58 AM | Updated on Mar 29 2026 6:58 AM

● పిప్పిరిలో బహిరంగ సభ ● ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష

కై లాస్‌నగర్‌: తాను చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్‌ 6న ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం పిప్పిరిలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నట్లుగా పేర్కొన్నారు. సభ ఏర్పాట్లపై శనివారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నతాధికారులతో అసెంబ్లీ కమిటీ హాల్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలు చేసే పత్రాలను సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. సభను విజయవంతం చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి బలమైన పునాది వేసిన ‘పీపుల్స్‌ మార్చ్‌’ పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 6న ఉదయం 11 గంటలకు సీఎం బాసరకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పిప్పిరికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, వెడ్మ బొజ్జు, ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా, ప్లానింగ్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ గౌరవ ఉప్పల్‌, ఎడ్యుకేషన్‌ సెక్రెటరీ యోగితారాణా, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, హరిత, కుమార్‌దీపక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement