కౌటాల: లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తిచేయాలని హౌసింగ్ డీఈ సత్రియ అన్నారు. మండల కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ ఇంటిని శుక్రవారం పరిశీలించి, లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ వివరాలను తెలిజేశారు. ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం పూర్తిచేసిన వారికి సకాలంలో బిల్లులు అందిస్తామని తెలిపారు. ఏప్రిల్ మూడో వారంలోగా పనులు పూర్తిచేసుకుని, గృహ ప్రవేశాలు చేయాలని సూచించారు. లబ్ధి దారుల సందర్శన కోసం మోడల్ ఇంటిని పనిదినాల్లో సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు తెరిచి ఉంచుతామని తెలిపారు. ఆయన వెంట ఏఈ ఎండీ షజయొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


