‘మానవతావాది అశోక చక్రవర్తి’ | - | Sakshi
Sakshi News home page

‘మానవతావాది అశోక చక్రవర్తి’

Mar 28 2026 7:48 AM | Updated on Mar 28 2026 7:48 AM

వాంకిడి: మౌర్య సామ్రాజ్యంలో ప్రజలకు సక ల సౌకర్యాలు కల్పించి మహా మానవతా వాదిగా సామ్రాట్‌ అశోక చక్రవర్తి ఎన్నో మన్ననలు పొందారని సమత సైనిక్‌ దళ్‌ జిల్లా అధ్యక్షుడు మార్షల్‌ దుర్గం సందీప్‌ అ న్నారు. మండల కేంద్రంలో శుక్రవారం సా మ్రాట్‌ అశోక చక్రవర్తి 2330వ జయంతి ఘ నంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బౌద్ధంలో ప్రార్థనలు చేశా రు. అశోకుడి రాజ్యంలోని ప్రజలకు విద్య, వైద్యం కోసం తక్షశీల, నలంద వంటి విశ్వవిద్యాలయాలను కట్టించారని గుర్తు చేశారు. బౌద్ధ ప్రచారంలో భాగంగా అనేక స్థూపాలు, శాసనాలు నిర్మించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సమాజ్‌ పెద్దలు దుర్గం శ్యాంరావు, రాజేశ్వర్‌, రోషన్‌ ఉప్రె, ప్రకాశ్‌, రమేశ్‌ డొంగ్రె, తిరుపతి, ఉపేందర్‌, ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement