ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఏఎంసీ చైర్మన్ ఇరుకుల మంగ, కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ అబ్దుల్లాతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వర్‌రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. పెట్టుబడి సాయం అందిస్తూ రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లేశ్‌యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు తారిఖ్, భీంరావు, కౌన్సిలర్ వినోద్, నాయకులు ఇందిరా, తిరుపతి, సుధాకర్, ఇమ్రాన్, నిజాం, హరీశ్, రాము, జక్కన్న, మారుతిపటేల్, శంకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.


