● కట్టుబాట్లు, క్రమశిక్షణతో ముందుకు ● నాగోబాను స్మరిస్త
పాదయాత్రలో మెస్రం వంశీయులు పూర్తిగా తెల్లని వస్త్రాలతోనే ముందుకు సాగుతారు. తలపాగా, చొక్కా, దోవతి/ప్యాంట్ అన్నీ శ్వేతవస్త్రాలే విని యోగిస్తారు. చెప్పులు లేకుండా రోజుకు 15 నుంచి 20 కిలోమీటర్లచొప్పున నడుస్తారు. ముందుగా నిర్దే శించిన ఎనిమిది గ్రామాల్లో మాత్రమే బస చేస్తారు. శాకాహారంతో కూడిన భోజనం స్వీకరిస్తారు. కల శం చేతబూనిన కటోడా పర్యవేక్షణలో, పర్దాన్ ముందుండగా వారిని మిగతా వారు అనుసరిస్తా రు. నాగోబాను స్మరిస్తూ అడుగులో అడుగేస్తారు. ఈ సారి ప్రధాన కటోడగా మెస్రం హన్మంతరావు, పర్దాన్‌గా దాదారావ్ వ్యవహరిస్తున్నారు. శనివారం డబోలి గ్రామానికి చేరుకున్నారు.


