గ్రామాల పేర్లు మార్చాలి
చింతలమానెపల్లి/కాగజ్‌నగర్‌రూరల్: నియోజకవర్గంలోని చింతలమానెపల్లి మండలం లంబాడిహే టి, కాగజ్‌నగర్ సమీపంలోని లం..గూడ గ్రామాల పేర్లు మార్చాలని ఎమ్మెల్యే హరీశ్‌బాబు మంత్రులను కోరారు. శనివారం అసెంబ్లీలో నియోజకవర్గంలోని సమస్యలు, అంశాలపై మాట్లాడారు. చింతలమానెపల్లి మండలంలోని లంబడిహేటి గ్రామానికి అక్కడి లంబాడాల మతగురువు ప్రేమ్‌సింగ్ మహరాజ్ పేరిట ప్రేమ్‌నగర్‌గా మార్చాలని తీర్మానించినట్లు తెలిపారు. కాగజ్‌నగర్ మండలంలోని ఒక గ్రామం పేరు పలకడానికి ఇబ్బందిగా ఉందని తాను స్పెల్లింగ్ మాత్రమే తెలియజేస్తానని పేర్కొన్నారు. ఆగ్రామం పేరును నందిగూడగా రెవెన్యూ, పంచాయితీ రికార్డుల్లో మార్చాలని సంబంధిత మంత్రులను కోరారు. కాగజ్‌నగర్ మండలంలో 2005లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆక్సిలరేటేడ్ ఇరిగేషన్ ప్రోగ్రాం కింద పెద్దవాగుపై జగన్నాఽథ్‌పూర్ ప్రాజెక్ట్ నిర్మించిందని, పెద్దవాగులో 365 రోజులూ నీళ్లుంటాయని తెలిపారు. రూ.135కోట్లతో పెండింగ్‌లో ఉన్న 10శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని కోరారు. అలాగే, నియోజకవర్గంలోని వివిధ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కరించాలని సంబంధిత మంత్రులను ఎమ్మెల్యే కోరారు.


