పంట విక్రయానికీ తిప్పలే..
పత్తి సాగులోనే కాకుండా రైతులకు చేతికి వచ్చిన దిగుబడి విక్రయంలోనూ తిప్పలు తప్పడం లే దు. అష్టకష్టాలు పడి సాగు చేసిన పత్తిని మద్దతు ధరకు అమ్మలేక రైతులు ఇబ్బంది పడుతున్నా రు. జిల్లాలో పత్తి సేకరణ వేగవంతమైనా సీసీఐ ఇంకా కొనుగోళ్లు ప్రారంభించలేదు. సాధారణంగా రైతులు సీజన్ ప్రారంభంలో పంటల సాగు కోసం వ్యాపారుల వద్ద కొంత మొత్తాన్ని పెట్టుబడి కోసం అప్పుగా తీసుకుంటారు. అయితే ది గుబడి వచ్చాక సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి ని విక్రయించి అప్పు తీర్చుకుందామనుకుంటే వారికి నిరాశే మిగులుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులిచ్చిన వ్యాపారులకే తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో వారు పత్తిలో తేమ పేరుతో రైతులను నిలువుదోపిడీ చేస్తున్నా రు. పత్తి పంటకు ప్రభుత్వం రూ.8,110 మద్దతు ధర ప్రకటించింది. జిల్లాలో 56వేల ఎకరాల్లో వ రి సాగు చేశారు. పలు మండలాల్లో ధాన్యం చేతి కి రావడంతో రైతులు అమ్మేందుకు అవస్థలు ప డుతున్నారు. అధికారులు స్పందించి వడ్ల కొనుగోలు కేంద్రాలతోపాటు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వేడుకుంటున్నారు. కా గా, వారంలోపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.


