కపాస్ కిసాన్ యాప్‌ను రద్దు చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: కపాస్ కిసాన్ యాప్‌ను రద్దు చేయాలని, ఎలాంటి నిబంధనలు లేకుండా రైతుల వద్ద ఉన్న పత్తిని పూర్తిగా కొనుగోలు చేయాలని రైతు హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో రైతు హక్కు ల పోరాట సమితి ముఖ్య నాయకుల సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మా ట్లాడుతూ.. దళారీ వ్యవస్థను రద్దు చేయాలని, 12 శా తం తేమ నుంచి 20శాతం వరకు సడలింపు ఇవ్వాలని కోరారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల సాధనకు ఈనెల 10న మధ్యాహ్నం 12 గంటలకు రైతు జేఏసీ ఏర్పాటుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో రైతు జేఏసీ జిల్లా నూతన కమిటీని ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. సమావేశానికి జిల్లాలోని ము ఖ్య రైతులు హాజరై విజయవంతం చేయాలని కోరా రు. నాయకులు రూప్‌నార్ రమేశ్, కేశవ్‌రావ్, నాగో సె శంకర్, జయరాం, తిరుపతి, అంజన్న, మారు తి, మెంగాజీ, దత్తు తదితరులు పాల్గొన్నా రు.


