మహిళలకు రక్షణ కల్పించాలి
కాగజ్‌నగర్ టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కాగజ్‌నగర్ మండలంలోని బసంత్‌నగర్ విలేజ్ నంబర్–12లో సంఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు మమతా రానా మాట్లాడుతూ.. దేశంలో మహిళలపై లైంగికదాడులు, హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయని తెలిపారు. మహిళలకు రక్షణ లేకుండా పోతోందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఐద్వా సంఘం కార్యదర్శి కాజల్ మండల్, మినోతి మండల్, వినతి బరుమన్, మినూ మండల్, మహిళలు పాల్గొన్నారు.


