ప్రాజెక్ట్‌లకు నిధులు కేటాయించాలి
కాగజ్‌నగర్ టౌన్: సిర్పూరు నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్ట్‌లకు నిధులు కేటాయించాలని రా ష్ట్ర సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఎ మ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు శనివారం వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్‌లోని అతడి నివా సంలో మంత్రిని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలి శారు. సిర్పూరు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉ న్న జగన్నాథ్‌పూర్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని, పీపీరా వు ప్రాజెక్ట్, ఖర్జి పెద్దచెరువులను పునరుద్ధరించాల ని, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంల నిర్వహణ పనులకు నిధు లు కేటాయించాలని మంత్రికి విన్నవించారు. కౌటా ల మండలంలోని తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ డీపీఆర్‌పై కూడా చర్చించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో పెండింగ్ ప్రాజెక్ట్‌లపై సమీక్ష నిర్వహిస్తానని తెలిపినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట ఇరిగేషన్ ఈఈ ప్రభాకర్, డీఈ భద్రయ్య, వెంకటరమణ తదితరులున్నారు.


