
బాల్యవివాహాలపై అవగాహన
కాగజ్‌నగర్‌టౌన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో శనివారం సిర్పూర్(టి) మండలంలోని వేంపల్లిలో బాల్యవివాహాలు, చట్టాలు, గ్యాస్ సిలిండర్ వినియోగంపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించా రు. కార్యక్రమానికి జిల్లా బాలల సంరక్షణ అధి కారి బూర్ల మహేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడీడు పిల్లలను పనుల్లో పెట్టకూడదన్నారు. గ్రామాల్లో బాల్య వివాహాలు చేస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ గణపతి, తిలావత్, రమేశ్, దత్తాత్రేయ, గ్రామస్తులు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.