
పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక
ఆసిఫాబాద్‌అర్బన్: డీసీసీ అధ్యక్ష ఎన్నికను ఎలాంటి అపోహలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్ నరేష్‌కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో పీసీసీ పరిశీలకులు శ్రీనివాస్, అనిల్‌కుమార్, జ్యోతి, పీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణక్క, ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావ్, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం స క్కుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆది వారం ఉదయం 10:30 గంటలకు జిల్లా కేంద్రంలోని అటవీశాఖ గెస్ట్‌హౌజ్‌లో డీసీసీ సమావేశం, మధ్యాహ్నం సిర్పూర్ నియోజకవర్గ సమావేశం, 13న జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం, 14న సాధారణ ప్రజలతో పా టు మేధావుల అభిప్రాయ సేకరణ, 19న పోటీలో ఉన్న అభ్యర్థులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పా టు చేసినట్లు తెలిపారు. ఎలాంటి ఒత్తిళ్లకు, పైరవీ లకు తావులేకుండా జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. రెండు జిల్లాల్లో పర్యటించి నివేదికను అధిష్టానానికి అందించనున్నట్లు పేర్కొన్నారు. యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గుండా శ్యాం, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గాదెవేణి మల్లేశ్, నాయకులు అనీల్‌గౌడ్, అబ్దుల్లా, మునీర్ పాల్గొన్నారు.
డీసీసీల ఎంపికకు కసరత్తు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి జిల్లాలో డీసీ సీ(జిల్లా కాంగ్రెస్ కమిటీ), నగర అధ్యక్షుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలైంది. ఆయా జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు సరైన నా యకులను ఎంపిక చేసేందుకు పార్టీ ప్రత్యేకంగా పరిశీలకులను నియమించింది. ఆదిలాబాద్, నిర్మ ల్ జిల్లాలకు ఎం.అనిల్‌కుమార్‌యాదవ్(ఎంపీ), సీహెచ్.రాంభూపాల్, లకావత్ ధన్వంతి, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, కుమురంభీంఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, రాష్ట్ర నాయకులు డా.పులి అనిల్‌కుమార్, అడువాల జ్యోతి, బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌ను ని యమించింది. పరిశీలకులు నాలుగు జిల్లాల పరిఽ దిలోని పది నియోజకవర్గాల్లో పర్యటించి, నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రస్తుతం పరిశీలకులు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పరిశీలకులకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరెవరు పోటీ పడుతున్నారు? ఆసక్తి గల నాయకుల నుంచి వివరాలు సేకరించడంతోపాటు సామర్థ్యం, డీసీసీ ఎంపికలో జిల్లా పరిస్థితులను అంచనా వేస్తూ అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ క్రమంలో కొత్త అధ్యక్షుల ఖరారులో ఏఐసీసీ పరిశీలకుల పర్యటన కీలకంగా మారింది.