
టీఏ, డీఏలు వెంటనే విడుదల చేయాలి
కాగజ్‌నగర్‌టౌన్: ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న టీఏ, డీఏ బిల్లులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల లచ్చిరాం డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యే విధంగా ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయడం బాధాకరమన్నారు. సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు భానుప్రకాష్, ప్రధాన కార్యదర్శి సదాశివ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, రాష్ట్ర బాధ్యులు రాంరెడ్డి, దామోదర్, కిరణ్, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.