
పత్రికా స్వేచ్ఛపై ‘కూటమి’ కుట్ర
పాతమంచిర్యాల: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ భయానక పరిస్థితులు సృష్టిస్తూ పత్రికా స్వేచ్ఛను హరించే కుట్ర చేస్తోందని జర్నలిస్టు, ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే గొంతుకలపై భౌతికదాడులతోపాటు పోలీసు కేసులతో తీవ్ర అణచివేతకు గురి చేస్తోందని విమర్శించారు. అధికారంలో ఉన్న పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో చేస్తున్న జాప్యం, మోసాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కార్మికులు, మహిళలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల పక్షాన వార్తల రూపంలో ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఫిర్యాదులు ఇప్పిస్తూ కేసులు నమోదు చేస్తుండడాన్ని తప్పుబట్టారు. తాజాగా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటు చేసే ప్రెస్ కాన్ఫరెన్స్ వార్తలు రాసిన సందర్భంలోనూ సాక్షి దినపత్రికతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఇళ్లలో తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ పత్రికాస్వేచ్ఛను హరిస్తూ, ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతులను నొక్కేస్తున్న అప్రజాస్వామిక చర్యలను జర్నలిస్టు, ప్రజాసంఘాల నాయకులు సర్వత్రా వ్యతిరేకిస్తున్నారు. అభిప్రాయాలు వారి మాటల్లోనే..