
ముమ్మాటికీ కక్ష పూరితమే..
ఏపీలో కూటమి సర్కారు చర్యలు భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే. వార్తలు రాసే జర్నలిస్టులపై కేసులు పెట్టడం ముమ్మాటికీ కక్షపూరిత చర్యలే. తక్షణమే ఈ చర్యలను నిలిపివేయాలని జర్నలిస్టు సంఘాల నుంచి హెచ్చరిస్తున్నాం.
– ఆర్.ప్రకాశ్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే(ఐజేయూ)
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
గొంతు నొక్కడం సరికాదు
మంచిర్యాలటౌన్: వార్తలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలే గానీ, ఆయా జర్నలిస్టులపై కేసులను పెట్టడం సరికాదు. ‘సాక్షి’ ఎడిటర్‌తోపాటు జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం, ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతునొక్కడంను మా సంఘం ఖండిస్తుంది.
– మిట్టపల్లి మధు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు
ఫెడరేషన్(టీయూడబ్ల్యూజేఎస్) జిల్లా అధ్యక్షుడు

ముమ్మాటికీ కక్ష పూరితమే..