ఆసిఫాబాద్: సాక్షి దినపత్రిక ఎడిటర్, జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు. నిరంకుశంగా వ్యవహరించడం సమంజసం కాదు. కథనాలపై అభ్యంతరాలుంటే ప్రజాస్వామ్యబద్ధంగా వివరణ కోరాలి. కానీ అక్రమ కేసులు పెట్టడం సరికాదు. సాక్షి దినపత్రికపై కూటమి ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర గవర్నర్ వెంటనే స్పందించి సాక్షి ఎడిటర్‌పై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. లేనిపక్షంలో పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు ఉద్యమిస్తాం.
– అబ్దుల్ రహమాన్,
టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు